ఇద్దరు కూలీల ప్రాణాలు తీసిన మంత్రి బ్యానర్లు - నంద్యాల జిల్లాలో ప్రమాదం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 8:35 PM IST
Two Persons Died in Nandhyala District : మంత్రి బ్యానర్లు ఇద్దరు కూలీల ప్రాణాలు తీశాయి. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో ఆర్థికమంత్రి బుగ్గన అభివృద్ధి పనులకు సంబంధించిన బ్యానర్లను కట్టేందుకు ఆరుగురు కూలీలతో ఐచర్ వాహనం బయలుదేరింది. ప్యాపిలి మండలంలోని పీఆర్ పల్లెలో రెండు బ్యానర్లను కట్టారు. అనంతరం జక్కసానిగుంట్ల గ్రామానికి వెళ్తుండగా గాలి బలంగా వీచడం వల్ల బ్యానర్లు కూలీల మీద పడ్డాయి. ఈ నేపథ్యంలో వెనక ఉన్న ఇద్దరు కూలీలు వాహనం నుంచి కింద పడ్డారు.
Two Laborers Died After Falling From a Vehicle Carrying Banners : ఈ ప్రమాదంలో బేతంచర్ల పట్టణానికి చెందిన సాయి శశాంక్ అక్కడికక్కడే మృతి చెందాడు. డోన్ పట్టణానికి చెందిన లాల్ బాషా పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లాల్ బాషా మృతి చెందాడు. రోజు కూలి రూ.400 చెప్పడం వల్ల బ్యానర్లు కట్టేందుకు వెళ్లారు. ఆ బ్యానర్లే వారి ప్రాణాలు తీస్తాయని ఊహించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.