thumbnail

By

Published : Oct 27, 2022, 11:13 AM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

ETV Bharat / Videos

గాజుల అలంకరణలో కొలువుదీరిన కనక దుర్గమ్మ

Bangles Decoration : ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కార్తీకమాసం రెండో రోజున జగన్మాతకు గాజుల అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి మూలవిరాట్​తో పాటు ఉపాలయాలను వివిధ రంగుల గాజులతో.. సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ గాజులను దేవస్థానానికి దాతలు అందజేశారు. వివిధ రంగుల గాజుల అలంకరణతో.. సౌభాగ్యవతిగా వెలిగిపోతున్న దుర్గమ్మను భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకుంటున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.