Balineni about Party Activists : 'తమ ప్రభుత్వంలో కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయాం' - ఒంగోలు వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18512210-669-18512210-1684166643553.jpg)
Balineni comments about party activists: ఈ నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నోక్కి ప్రజలకు సేవ చేస్తున్నారు. కానీ తమ ప్రభుత్వంలో కార్యకర్తలకు ఏమి చేయలేకపోయామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.. రాజకీయాల్లో కార్యకర్తలే మూలం.. నిజంగా వారే లేకపోతే నాయకుల మనుగడే లేదని అన్నారు. అలాంటి మన కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉందని అన్నారు. అలానే మనం వారిని గమనించుకుని.. మనం చేయాల్సిన పనులను చేస్తూ ముందుకు వెళ్లాలి. వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డానని.. పార్టీ కార్యకర్తల కోసం ఏదైనా చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో అతి విశ్వాసం పనికిరాదు.. ప్రజలపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని వ్యాఖ్యానించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తాను మార్కాపురం, గిద్దలూరు నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. నా జీవితం ప్రారంభమైంది ఒంగోలులోనే కాబట్టి ఇక్కడ మాత్రమే పోటీ చేస్తా ఇంకెక్కడా పోటీ చేయను అని స్పష్టం చేశారు.