ఆరంభశూరత్వమే! స్పందన కరవైన ఆడుదాం ఆంధ్రా - చేతులెత్తేసిన సచివాలయ సిబ్బంది! - సచివాలయ సిబ్బంది ఇబ్బందులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-12-2023/640-480-20367518-thumbnail-16x9-audham-andhra.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 5:14 PM IST
Audham Andhra Program Without Response : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి స్పందన కరవైంది. మొదటి రోజు ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరవడం వల్ల బలవంతంగా ప్రజలను తీసుకువచ్చిన సచివాలయ సిబ్బంది రెండవ రోజు చేతులెత్తేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆటలు ఆడేందుకు ఏర్పాటు చేశారు. క్రీడాకారులను తీసుకొచ్చే బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించారు. అయితే మధ్యాహ్నం అయినా కూడా క్రీడాకారులు ఎవరు రాకపోవడం వల్ల మైదానాలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఆటలు ఆడేందుకు ప్రజలను ఎంత బతిమాలినా ఎవరు రావడం లేదంటూ సచివాయం సిబ్బంది తర్జన బర్జన పడుతున్నారు
Difficulties of Secretariat Staff : గ్రామాలలో ఉన్న క్రీడా ఆణిముత్యాలను వెలికితీసే కార్యక్రమానికి మంగళవారం జగన్ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఆడుదాం ఆంధ్రకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని చెప్పుతున్న నేతలు తీరా చూస్తే మైదానంలో పదుల సంఖ్యలో కూడా క్రీడాకారులు కనిపించ లేదు. వారిని మైదానాల్లోకి తీసుకు రావడానికి సచివాలయ సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం వల్ల సచివాలయ సిబ్బందికి అదనపు భారం అవుతుందని పేర్కొన్నారు.