Assault on Officer Investigating Complaint in Spandana: 'స్పందన' ఫిర్యాదుపై విచారణ చేస్తున్న అధికారిపై దాడి.. కేసు నమోదు - Complaint in spandana against vra in boddam
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2023, 5:26 PM IST
Assault on Officer Investigating Complaint in Spandana: స్పందనలో వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్న రెవెన్యూ అధికారులపై.. ఫిర్యాదు చేసిన వారు దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. జిల్లాలోని బొద్దాం గ్రామం లోని కొన్న రమణమ్మ అనే మహిళ అదే గ్రామానికి చెందిన వీఆర్ఏ (VRA) లీలావతిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపై అధికారులు బొద్దాం గ్రామం వెళ్లి విచారణ చేస్తున్న సమయం లో రమణమ్మ, వీఆర్ఏ లీలావతి అధికారులు ముందే విచక్షణ కోల్పోయి పరస్పరం చెప్పులతో దాడులు చేసుకున్నారు. అపేందుకు అధికారి ప్రయత్నించగా వారిపైన కూడా దాడులకు పాల్పడ్డారు. తమ విధులకు ఆటంకం కలిగించి.. దాడులు చేయడంతో రమణమ్మ, వీఆర్ఏ లీలావతిపై రాజాం పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.