'సీఎం జగన్​ ​రెడ్డి మోసం చేశాడు - సమాన పనికి సమాన వేతనం హామీ అమలు ఎక్కడ?' - ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 12:49 PM IST

Asha Workers Demand That YCP Government Solve The Problems: ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని మండిపడ్డారు. ఆశ కార్యకర్తల   సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో రాష్ట్ర ఆశ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గాభవాని కాంట్రాక్ట్ ఔట్సోర్స్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని పేర్కొన్నారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరుతున్నారు. కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పేర్కొన్నారు. కరోనా విపత్తు సమయంలో ఆశ వర్కర్లు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. కరోనా సమయంలో మరణించిన ఆశ వర్కర్లకు ప్రభుత్వం నేటి వరకు కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని లేదంటే ఉద్యమ బాట చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.