Arya Vaishya Association clashes హత్యాయత్నం చేశాడని.. ఇంటిని ధ్వంసం చేసేందుకు ఆర్యవైశ్య అధ్యక్షుడు యత్నం - Govindaraju attacked Arya Vaishya Sangha president
🎬 Watch Now: Feature Video
Attack on Arya Vaishya President Jayam Vishwanath: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం కళ్యాణదుర్గం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు జయం విశ్వనాథ్‌పై గోవిందరాజు అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ఆర్యవైశ్య సంఘంకు చెందిన నిధులు రాజేశాడని ప్రశ్నించేందుకు తనపై దాడి చేసినట్లు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు విజయం విశ్వనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో గోవిందరాజులు ఆర్యవైశ్య కాంప్లెక్స్‌పై అద్దెకు ఉంటూ ఏర్పాటు చేసుకున్న షెడ్డును తొలగించడానికి ప్రయత్నం చేశారు.. ఈ ప్రయత్నానికి పోలీసులు అడ్డుపడగా జయం విశ్వనాథ్ పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. షెడ్డు లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించకపోవడంతో వెనుక వైపు నుంచి నిచ్చెనలు వేసుకొని ఆర్యవైశ్యులు కొంతమంది షెడ్డు లోపలికి చేరుకుని తీసివేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ.. గోవిందరాజులు అనే వ్యక్తి ఆర్యవైశ్య సంఘం భవనం అద్దెకు తీసుకొని దాని అద్దె కూడా చెల్లించలేదని ఆరోపించారు. గోవిందరాజులు అనే వ్యక్తిని సంఘం ఉపాధ్యక్షుడిగా మాత్రమే తొలగించానని.. కుల బహిష్కరణ చేసే అధికారం తమకు లేదని వివరించారు.