APPSC Group1 Ranker Swetha Interview: తొలి ప్రయత్నంలోనే ఎంపీడీవోగా శ్వేత.. విజయం వెనుకున్న అసలు కథ ఇదే..
🎬 Watch Now: Feature Video
APPSC Group1 Ranker Swetha Interview: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే గ్రూప్-1 తుది ఫలితాలు రానేవచ్చాయి. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఏళ్లు తరబడి ప్రిపేరై గ్రూప్-1 సాధించడమే లక్ష్యంగా.. అహోరాత్రులు శ్రమించిన ఎంతోమంది కల.. ఫలితాల రాకతో నెరవేరినట్లైంది. గ్రూప్-1 తుది ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన పలువురు అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1 ఉద్యోగం సాధించాలంటే ఏళ్ల తరబడి శ్రమించాల్సి ఉంటుంది. సరైన శిక్షణ, సాధన అవసరం. ఏళ్లు తరబడి ప్రిపేరై.. నిరంతరం కష్టపడితేగానీ.. ఈ పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలువలేరు. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 ఏళ్ల దండా శ్వేత తన తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 లో విజేతగా నిలిచింది. మండల అభివృద్ధి అధికారిగా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మరి తనను ప్రోత్సాహించి ముందుకు నడిపిందేవరు? ఈ ఉద్యోగం సాధించటానికి తను పడ్డ కష్టం వెనుకున్న అసలు కథ ఏంటి..? భవిష్యత్ లక్ష్యం ఏంటి? ఈ విజయాన్ని పొందేందుకు తన ప్రిపరేషన్ ఎలా కొనసాగించింది..? వంటి అంశాలపై విషయాలను శ్వేతను అడిగి తెలుసుకుందాం రండి..