APNGO Leaders Dharna స్టేట్ ఆడిట్ డైరెక్టర్‌కు వ్యతిరేకంగా ఏపీఎన్జీఓ నేతల ధర్నా
🎬 Watch Now: Feature Video
APNGO Leaders Dharna In Kurnool : స్టేట్ ఆడిట్ డైరెక్టర్ హరిప్రసాద్ నియంతలా వ్యవహరిస్తున్నారని కర్నూలులో ఏపీఎన్జీఓ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు చెందిన ఎనిమిది జిల్లాల్లో సీనియర్ ఆడిట్ ఆఫీసర్స్‌ను ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్నారని వారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గవర్నమెంట్ విడుదల చేసిన జీఓ నెంబర్ 71 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను మే నెల 31వ తేదీ వరకే నిర్వహించాలని, దీనికి వ్యతిరేకంగా స్టేట్ ఆడిట్ డైరెక్టర్ హరి ప్రసాద్ జూన్ మూడో తేదీన రాయలసీమకు చెందిన సీనియర్ ఆడిట్ ఆఫీసర్లను 56 మందిని బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ బదిలీలల్లో ప్రభుత్వ నిబంధనలను ఆయన పాటించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీఓ నెంబర్ 71 ప్రకారం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్లను 36 మందిని బదిలీ చేయగా వాటిని రద్దు చేస్తూ.. స్టేట్ ఆడిట్ డైరెక్టర్ 56 మందిని బదిలీ చేస్తున్నట్లు మూడో తేదీ ఆర్డర్స్ విడుదల చేయడం సరికాదని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్టేట్ ఆడిట్ డైరెక్టర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు వెంగల్ రెడ్డి డిమాండ్ చేశారు.