Protest to YSRCP MLA: జాబ్ క్యాలెండర్ ఏమైంది? జగన్ హామీలు ఏమయ్యాయి ? వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ
🎬 Watch Now: Feature Video
YSRCP MLA Karanam Dharmashree protest sega: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి మరోసారి నిరసన సెగ ఎదురైంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు నేరవేర్చలేదంటూ గిరిజన యువత కరణం ధర్మశ్రీని నిలదీశారు. తమకు సంక్షేమ పథకాలు వద్దని, తమ ప్రాంతాలను నాన్ షెడ్యూల్ నుంచి షెడ్యూల్‌లోకి మార్చాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలోని చలిసింగం ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కరణం ధర్మశ్రీ.. గడపకు గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటుండగా ఇక్కడి యువత.. జాబ్ క్యాలెండర్ ఏమైంది..? ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? మెగా డీఎస్సీ ఎక్కడికి పోయింది..? అంటూ కరణం ధర్మశ్రీని ప్రశ్నించారు. దీంతో యువత అడిగిన ప్రశ్నలకు సమధానం చెప్పలేక ప్రభుత్వ విప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌గా మారింది.