AP Professional Forum Round Table Meeting: 'చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అధికారులపై ప్రైవేట్ కేసులు నమోదు చేయించాలి'

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2023, 8:32 PM IST

AP Professional Forum Round Table Meeting: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అధికారులపై ప్రైవేట్ కేసులు నమోదు చేయించాలని ఏపీ ప్రొఫెషనల్ ఫోరమ్ పేర్కొంది. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఏపీ ప్రొఫెషనల్ ఫోరం తీర్మానించింది. రాజ్యాంగ రక్షకులే రాజకీయ ఒత్తిళ్లతో భక్షకులౌతున్నారా! అనే అంశంపై తిరుపతి జిల్లా రేణిగుంటలో ..ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలతో కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. అధికారుల వ్యవహార శైలి పై విస్తృత స్థాయి చర్చ జరిపి.. చర్యలు తీసుకోవాలని ఫోరమ్ సభ్యులు డిమాండ్ చేశారు. 

రాజ్యాంగం ప్రసాదించిన అపారమైన అధికారాలు రాజ్యాంగ పరిరక్షణ కోసమా? లేదా రాజకీయ పార్టీల కక్ష సాధింపు చర్యల కోసమా? అనే అంశం పై ప్రొఫెషనల్ ఫోరమ్ చర్చిచింది. రాజ్యాంగాన్ని అధికారులు, రాజకీయ పార్టీలు వారి వారి ఎజెండా మోయటానికి ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ, చట్టబద్ద పాలనకు పౌరులకు చట్టం కల్పించిన అవకాశాలను దుర్వినియోగం చేస్తున్న వైనంపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.