AP NGOS Leaders Comments on YSRCP Govt: వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ సంతోషంగా లేరు: బండి శ్రీనివాస్ - Andhra Pradesh govt employees News
🎬 Watch Now: Feature Video
AP NGO president Bandi hot comments on YSRCP govt: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా సంతోషంగా లేరని.. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని తామెక్కడా, ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఉద్యోగులకు సంబంధించి పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్న బండి.. వీటిని పరిష్కరించాలని పలుమార్లు జగన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. ఆగస్టు 21, 22 తేదీల్లో ఏపీ ఎన్జీవో మహా సభలను నిర్వహించాలని తాము నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఆగస్టు 21, 22 తేదీల్లో ఎన్జీవో మహా సభలు.. విజయవాడలో ఏపీ ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో మహా సభల పోస్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాస్ మాట్లాడుతూ..''ఆగస్టు 21, 22 తేదీల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్జీవో మహా సభలు జరపనున్నాం. ఈ సభలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గతంలో మా ఉద్యోగుల మహా సభలకు సీఎంలు వచ్చినపుడు కొన్ని సమస్యల పరిష్కారంపై హామీలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ఈసారి సీఎం జగన్ వచ్చినపుడూ మేలు జరుగుతుందని మా ఉద్యోగులంతా ఆశిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఎనైనా మహసభల్లో సీఎం ప్రకటిస్తారని మేమంతా ఆశిస్తున్నాము. 71 డిమాండ్లపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చాం. మహా సభల్లో కూడా మరోసారి మా డిమాండ్లను వినతి పత్రం రూపంలో సీఎం జగన్‌కు ఇస్తాం. అవి సీఎం జగన్ నెరవేర్చుతారని ఆశిస్తున్నాము. ఈ మహా సభలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము'' అని ఆయన అన్నారు.