'తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ 'ఎస్సీ వర్గీకరణ' హామీ - ఉమ్మడి రాష్ట్రంలో మూడు తీర్మానాలు మర్చిపోయారా?'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 5:16 PM IST

thumbnail

AP MRPS President comments on PM Modi SC Classification : ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ హామీలను తాము నమ్మడంలేదని ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సువర్ణ రాజు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మూడుసార్లు శాసనసభ ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణపై తీర్మానాలు చేస్తే.. ప్రధాని మోదీ మళ్లీ ఇప్పుడు కమిటీ వేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ఎన్నికలల్లో లబ్ధి పొందాలనే హైదరాబాద్ లో జరిగిన మాదిగల విశ్వరూప సభలో మోదీ ప్రకటన చేశారని ఆరోపించారు.

AP MRPS President  Suvarna Raju Fire on Modi : విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సువర్ణ రాజు మాట్లాడుతూ... అనేక బిల్లులు అకస్మాత్తుగా తెచ్చిన మోదీ ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు‌ వెంటనే ఆమోదం తెలపాలన్నారు. కేవలం  ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఇటువంటి హామీలు ఇవ్వడం తగదన్నారు. నిజంగా  ఎస్సీ వర్గీకరణ చెయ్యాలంటే ఇంతకు ముందు వారి పాలనలో ఎందుకు చెయ్యలేదని మండిపడ్డారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రధాని మోదీ మాదిగల విశ్వరూప సభను నిర్వహించారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.