Jal Jeevan Mission: జల్ జీవన్ మిషన్ పథకం అమలులో ఏపీ విఫలం: గజేంద్ర షెకావత్​ - Rajya Sabha News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 24, 2023, 10:46 PM IST

Updated : Jul 25, 2023, 6:28 AM IST

Jal Jeevan Mission Scheme: జల్ జీవన్ మిషన్ పథకం అమలులో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరు బాగోలేదని, కేంద్రం ఇచ్చిన నిధుల్ని వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ వివరించారు. 2021 నుంచి ఈ పథకం కింద కేటాయించిన డబ్బును ఇప్పటివరకు ఉపయోగించుకోలేదని ఇది చాలా ఆందోళనకర పరిస్థితని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనివలన రాష్ట్ర ప్రజలకు కేంద్ర పథకం ఫలాలు అందడం లేదని.. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. జల్ జీవన్ పథకం అమలులో పనితీరు సరిగ్గా లేని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అని.. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తుండగా ఒక్క మన రాష్ట్రం మాత్రమే ఆ పథకాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదని నేడు కేంద్ర జలశక్తి మంత్రి చేసిన వ్యాఖ్యల్ని వింటే అర్థం అవుతుంది. 

Last Updated : Jul 25, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.