AP Genco MD Visit Polavaram Power House: పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులను పరిశీలించిన ఏపీ జెన్కో ఎండీ - ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2023, 9:28 PM IST

AP Genco MD Visit Polavaram Power House: పోలవరం ప్రాజెక్టులోని జల విద్యుత్ కేంద్రం పనుల్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్​లోని స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్​లను జెన్కో ఎండీ పరిశీలించారు. అనంతరం ఫెర్రెల్స్ తయారు చేసే ప్రాంతం పరిశీలించి.. వాటిని తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పోలవరం జల విద్యుత్ కేంద్రం ఎగువ ప్రాంతం నుంచి నిర్మాణాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి జల విద్యుత్ కేంద్రం టన్నెల్స్ నుంచి ప్రయాణించి దిగువ ప్రాంతానికి చేరుకొని కోన్, డ్రాఫ్ట్ ట్యూబ్లు ఏర్పాట్లను పరిశీలించారు. టైల్ రైజ్ ఛానల్​ను కూడా ఆయన పరిశీలించారు. అనంతరం జెన్​కో, ఎంఈఐఎల్ సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్దేశిత లక్ష్యం మేరకు జరుగుతున్నాయని, ఇక నుంచి ప్రణాళిక ప్రకారం పనులు చేసి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని తెలిపారు. విద్యుత్ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉత్పాదన ప్రారంభం అయితే రాష్ట్రంలో విద్యుత్ కొరత తీరుతుందని, పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి అవసరమైన మేర విద్యుత్ సరఫరా చేయవచ్చని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.