Anganwadi Workers Called for Protest: వేధింపులను నిరసిస్తూ.. ఆందోళనకు సిద్ధమైన అంగన్వాడీలు - అంగన్వాడీ వర్కర్స్ యూనియన్
🎬 Watch Now: Feature Video
Anganwadi Workers Called for Protest: రాష్ట్రంలో అంగన్వాడీలపై వేధింపులు ఎక్కువయ్యాయని.. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ పేరుతో అధికారులు, రాజకీయ నాయకులు పర్యటిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న హామీని ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జులై 10, 11 తేదీలలో నిరవధిక ఆందోళన చేపడుతున్నట్లు ప్రకటించారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటివి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో హనుమాయమ్మ అనే అంగన్వాడీని రాజకీయ కక్షలతో చంపారని ఆరోపించారు. పామర్రులో అన్నపూర్ణ అనే మహిళను కూడా రాజకీయ నాయకులు వేధించారని.. ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. ఇలాంటి ఘటనలను నిరోధించాలని, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.