Andhra Body Building Competitions: మోదకొండ ఉత్సవాల వేళ రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల నిర్వహణ - ఏపీ ముఖ్యవార్తలు
🎬 Watch Now: Feature Video
Andhra Body Building Competitions in Paderu : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. మోదకొండ ఉత్సవాల సందర్భంగా 26వ రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది యువకులు పాల్గొన్నారు. 8 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి తుది బాడీ బిల్డింగ్ ప్రతిభ పెట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిభ కలిగిన బాడీ బిల్డర్స్ వచ్చారు. జడ్జిలుగా ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుర్నాథ్తో పాటు రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ కేటగిరీల బరువుల స్థానంలో ఈ పోటీలు జరిగాయి. ఒక్కొక్క కేటగిరి నుంచి గెలుపొందిన వారికి తుది బాడీ బిల్డింగ్ పోటీ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి సతీష్ కుమార్ అనే యువకుడు ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచాడు. 20 వేల నగదుతో పాటు పతకం అందించారు. పాడేరు జిమ్ నిర్వాహకులు కొట్టగుల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి.