Rowdy sheeter brutal murder: ఊడేరులో రౌడీ షీటర్ దారుణ హత్య.. కారణం ఏమిటంటే..? - Rowdy sheeter Kannababu brutally murdered
🎬 Watch Now: Feature Video
Rowdy sheeter Kannababu brutally murdered: ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం రేపింది. నేటి ఉదయం బహిర్భుమికి వెళ్లిన ఓ వ్యక్తి రక్తం మడుగులో మృతదేహం పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో హూటాహూటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఈ ఘటన జరగడానికి గల కారణాలను అనకాపల్లి గ్రామీణ సీఐ రవి కుమార్ మీడియాకు వెల్లడించారు.
రియల్ ఎస్టేట్ కారణంగా రౌడీషీటర్ దారుణ హత్య.. సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..''అనకాపల్లి జిల్లా ఊడేరులో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పెందుర్తిలోని సుజాత నగర్‌కు చెందిన కన్నబాబు కొంతకాలంగా అనకాపల్లిలో నివాసం ఉంటున్నాడు. కన్నబాబుపై 30 హత్యాహత్యాయత్నం, దారి దోపిడి కేసులు ఉన్నాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఉన్న రౌడీషీట్‌ను అనకాపల్లికి మార్చారు. కన్నబాబు హత్యకు రియల్ ఎస్టేట్ వ్యాపారమే కారణమై ఉండొచ్చని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అతను ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా తలదూర్చేవాడిని తెలిసింది. దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.'' అని అన్నారు. ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుని వేలిముద్రలు సేకరించారు.