చంద్రబాబు విడుదలతో దుర్గమ్మ సన్నిధికి అమరావతి రైతుల పాదయాత్ర - నర్సాపురంలో టీడీపీ నేతలు - Chandrababu latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 1:27 PM IST

Amaravati Farmers Padayatra With Chandrababu Release : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదలైనందుకు (Chandrababu Naidu Release) రాజధాని మహిళలు, రైతులు పాదయాత్ర చేపట్టారు. వెలగపూడి నుంచి విజయవాడ కనకదుర్గ గుడికి పాదయాత్ర చేశారు. శుక్రవారం అమ్మవారికి మొక్కు చెల్లించుకునేందుకు రైతులు కాలినడకన దర్శనానికి వెళ్లారు. చంద్రబాబు క్షేమంగా ఉండాలని దుర్గగుడిలో పూజలు చేయించనున్నారు.

TDP Leaders Padayatra With CBN Interim Bail : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ (CBN Interim Bail) రావడం పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ కార్యాలయం నుంచి పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పాదయాత్రగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. నరసాపురం నుంచి వశిష్ఠ గోదావరి మాధవాయి పాలెం-సఖినేటిపల్లి రేవు దాటి కోనసీమ జిల్లా లో గోదావరి ఏటిగట్టు మార్గంలో రామేశ్వరం మీదుగా 20 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. "సైకో పోవాలి..సైకిల్ రావాలి" అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్ర సాగింది.

ఈ సందర్భంగా పొత్తూరి రామరాజు మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి జరగాలని, చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని కోరుతూ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తామన్నారు. సీఎం జగన్ రోజు రోజుకూ రాక్షస పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక దందా చేస్తూ రాష్టాన్ని దోచుకుంటున్న వైసీపీ నాయకులు చంద్రబాబుపై ఇసుక కేసు మోపడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.