Allegations On Police: విచారణ పేరుతో పిలిచి చితకబాదారు.. ఓ బాధితుడి ఆవేదన - ysr district latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2023, 10:34 PM IST

Allegations On Police : ఈ మధ్య కాలంలో పోలీసులు అనుమానితులను స్టేషన్​కు పిలిచి చితకబాదుతున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. రెండు రోజుల క్రితం నంద్యాల జిల్లాలో బైక్ చోరీ కేసులో ఓ వ్యక్తిని అనుమానించిన పోలీసులు స్టేషన్​కు పిలిచి.. నేరం ఒప్పుకోవాలని వేధింపులకు గురి చేశారు.. ఇది భరించలేక.. పోలీసులు ఆగడాలను సెల్ఫీ వీడియో ద్వారా బయట పెట్టాడు. అనంతరం రైలు కింద పడి తన ప్రాణాలను బలి చేసుకున్నాడు. ఈ సంఘటన మరువక ముందే వైఎస్సార్​ జిల్లాలో పోలీసులు తనను అనవసరంగా కొట్టారని ఓ వ్యక్తి ఆరోపిస్తున్నాడు. 

వైఎస్సార్ జిల్లా రాజుపాలెం పోలీసులు విచారణకు పిలిచి తనను కొట్టారని వెంగలయపల్లెకు చెందిన ఓబులేసు ఆరోపించారు. దీంతో అతను ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. ఇటీవల గాదెగూడూరులో లక్షుమమ్మ అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసులో ఓబులేసుపై అనుమానం ఉండటంతో పోలీసులు విచారణకు పిలిచారు. ఈ క్రమంలో పోలీసులు కర్రలతో కొట్టారని, కాళ్లతో విచక్షణారహితంగా తన్నారని బాధితుడు ఆరోపించారు. కుమారుడిని ఆసుపత్రిలో చూసిన బాధితుడి తల్లి బోరున విలపించింది. అయితే ఓబులేసును తాము కొట్టలేదని పోలీసులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.