Achchennaidu Comments on Jagan: 'ఇడుపులపాయలో సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేని స్థితిలో జగన్' - Achennaidu comments on attack on Babasaheb
🎬 Watch Now: Feature Video
Achchennaidu Comments on Jagan: ప్రజాస్వామ్యం ముసుగులో దాగిన ఫాసిజం పడగలు రాష్ట్రంలో ప్రమాద ఘటికలు మొగిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పాతపాడులో 5వ వార్డుకు నామినేషన్ వేసిన బాబాసాహెబ్‌పై వైసీపీ నాయకులు దాడి చేసి విత్ డ్రా చేసుకోవాలని బెదిరింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గమని ఆక్షేపించారు. ఇడుపులపాయ నుంచి వార్డు సభ్యుల్ని కూడా గెలిపించుకోలేని స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని దుయ్యబట్టారు. ఏ నియంత పాలనలోనూ కనిపించని దౌర్జన్య కాండను జగన్ రెడ్డి రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్న జగన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎద్దేవాచేశారు. బాబాసాహేబ్పై దాడి చేసిన వైసీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను ఎన్నికల సంఘం పరిశీలించి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరారు.