నేటి నుంచి 'ఆడుదాం ఆంధ్రా' క్రీడా పోటీలు, ప్రారంభించనున్న సీఎం జగన్ - Aadudam Andhra games in ap
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 8:41 AM IST
Aadudam Andhra Games in AP : 'ఆడుదాం ఆంధ్రా' పేరిట క్రీడా పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు (మంగళవారం) ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆటలు కొనసాగుతాయి. 47 రోజులపాటు రాష్ట్రంలో ఈ పోటీలు జరగనున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్ తదితర ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తారు. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో బహుమతుల ప్రదానం చేస్తారు. విజేతలకు రూ. 12 కోట్లకు పైగా నగదు బహుమతులు, మరెన్నో ఉత్తేజకరమైన బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పోటీల్లో పాల్గొనేందుకు 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.