Online Trading Fraud : ఆన్లైన్ ట్రేడింగ్ ఉచ్చు.. యువకుడు జేబు ఖాళీ - Online Trading Fraud In Jangareddygudem
🎬 Watch Now: Feature Video
Online Trading Fraud In Jangareddygudem : సైబర్ కేటుగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ యువకుడి నుంచి నగదు కాజేసిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన ఓ యువకుడు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. పార్ట్ టైం ఉద్యోగం పేరిట గత నెల 2న తన చరవాణికి సంక్షిప్త సందేశం రావడంతో అతడు అంగీకారం తెలిపాడు. దీంతో వారు ఓ టెలిగ్రామ్ గ్రూపును సృష్టించి ఆ యువకుడిని అందులో సభ్యుడిగా చేర్చారు. గూగుల్ మ్యాప్స్‌లో పలు కంపెనీలు, హోటళ్లకు రేటింగ్లు ఇస్తే డబ్బు ఇస్తామని నమ్మబలికి పని చేయించుకున్నారు. ఇదే క్రమంలో ట్రేడింగ్ యాప్‌లో డబ్బు పెట్టుబడి పెడితే నగదు ఇస్తామని యువకుడికి గాలం వేశారు.
దీంతో ఆ యువకుడు వివిధ దఫాలుగా 3 లక్షల 55 వేల రూపాయలు వివిధ అకౌంట్లకు పంపించాడు. అనంతరం టెలిగ్రామ్ గ్రూపును నిలుపుదల చేసి సందేశాలను తొలగించేయడంతో మోసపోయినట్లు గ్రహించిన ఆ యువకుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.