Mother's Wish: తల్లి కోరికను తీర్చిన తనయుడు.. - శ్రీరామచంద్రుడు
🎬 Watch Now: Feature Video
Son Fulfilled His Mother's Wish: తన తల్లి కోరిక మేరకు అయోధ్య రామమందిర నూతన నిర్మాణ నమూనాను టేకు తో తయారు చేశాడు విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి లక్ష్మీనారాయణ. ఆ రాముడు తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు రాజ్యాన్ని వదిలి అడవి బాట పట్టాడు. ఆ రామచంద్రుడి భక్తురాలైన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన 90 సంవత్సరాల వృద్ధురాలు యశోదమ్మ కోరిక తీర్చేందుకు ఆమె తనయుడు విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి లక్ష్మీనారాయణ అయోధ్య నూతన రామాలయం నమూనాను టేకుతో సొంతంగా తయారు చేశాడు.
ఇందుకోసం గత మూడు నెలల నుండి రోజుకు 10 నుండి 12 గంటల శ్రమించి రెండు అడుగుల వెడల్పు మూడు అడుగుల పొడవు 16 ఇంచుల ఎత్తు పరిమాణంలో తయారుచేసాడు. దీనికి లోపల ఎల్ఈడి లైటింగ్ సదుపాయం ఏర్పాటు చేయడంతో రాత్రి సమయంలో విద్యుత్ కాంతులతో కనివిందు చేస్తుంది .అయోధ్యలోని నూతన రామ మందిరాన్ని చూసే భాగ్యం తనకు కలుగుతుందో లేదోనన్న అమ్మ మాటలకు చల్లించి రామమందిర తయారు చేసినట్లు లక్ష్మీనారాయణ తెలిపాడు. నేడుఅనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఆవోపా సభ్యుల ఆహ్వాన మేరకు వాసవి మాత ఉత్సవాలలో భాగంగా నేడు దేవాలయంలో ప్రదర్శనకు ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చదవండి: