1998 DSC Qualified Candidates Protest in Tadepalli: ఉద్యోగాలివ్వాలని.. తాడేపల్లిలో 98 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల వినూత్న నిరసన
🎬 Watch Now: Feature Video
1998 DSC Qualified Candidates Protest In Tadepalli : 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు తాడేపల్లిలో వినూత్న నిరసన చేపట్టారు. డీఎస్సీ 1998లో ఉద్యోగానికి అర్హత సాధించిన వారందరికీ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. సీఎం జగన్ నివాసం ఉండే తాడేపల్లిలో వీధుల వెంట తిరుగుతూ జగనన్నా.. అంటూ జోలె పట్టి భిక్షాటన చేశారు. రోడ్డువెంట ఉన్న దుకాణదారులు, వాహనదారులను భిక్షం అడిగారు. అర్హత కల్గిన వారందరికీ ఉద్యోగాలివ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం అర్హులైన 2వేలకు పైగా అభ్యర్థులకు మెుండి చేయి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటించకుండా కేవలం మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయడం వల్ల కేవలం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకే న్యాయం జరిగిందన్నారు. మెరిట్ ఆధారంగా భర్తీ చేపట్టటంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భిక్షాటన చేయగా వచ్చిన డబ్బును ప్రభుత్వానికి జమ చేస్తామని, ఆ డబ్బుతోనైనా తమకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. సీఎం జగన్ వెంటనే స్పందించి డీఎస్సీ 1998లో అర్హత సాధించిన వారందరికీ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు.