King Cobra Viral video:13 అడుగులు కింగ్ కోబ్రా పాము..ఎక్కడో తెలుసా? - 13 Feet Long King Cobra Snake Caught at Srikakulam

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 11, 2023, 8:57 PM IST

చాలా మందికి పాములంటే విపరీతమైన భయం. ఒకవేళ పాములు కనిపిస్తే చెప్పనవసరమే లేదు ఇల్లు పీకి పందిరి వేస్తారు మనవాళ్లు. పాములలో కింగ్ కోబ్రా పేరు వింటేనే చాలా మంది భయంతో వణికిపోతారు. అలాంటిది 13 అడుగుల పొడవున్న పామును చూస్తే ఇంకా ఏమైనా ఉందా?

శ్రీకాకుళం జిల్లాలో కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది. దీని పొడవు ఒకటి రెండు అడుగులు కాదు ఏకంగా 13 అడుగులు ఉంది. ఆ కింగ్ కోబ్రాను చూసిన వాళ్ల భయాబ్రాంతులకు లోనయ్యారు. పొలం పనులకు వెళ్తుండగా భారీ కింగ్ కోబ్రా కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. కంచిలి మండలం కుమ్మరినౌగాంలో నివాసాల వద్ద స్థానికులు పామును గుర్తించారు. ఆందోళనకు గురై వెంటనే సోంపేటలో పాములు పట్టే బాలరాజుకు సమాచారం అందించారు. బాలరాజు చాకచక్యంగా కింగ్‌ కోబ్రాను పట్టుకున్నాడు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. అధికారుల సూచనల మేరకు దాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టినట్లు స్థానికులు తెలిపారు. కంచిలి మండల పరిధిలో జలంత్రకోట, బొగాబెణి ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా తరచూ పాములు కనిపిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.