108 Vehicle Stopped in Middle of The Road and Person Died: ఆస్పత్రికి వెళ్తుండగా ఆగిపోయిన 108 వాహనం.. గాల్లో కలిసిన నిండు ప్రాణం - AP accident news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 9:07 PM IST

Updated : Oct 22, 2023, 6:16 AM IST

108 Vehicle Stopped in Middle of The Road and Person Died: అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి తరలించాల్సిన 108 అంబులెన్స్‌ మార్గం మధ్యలో మొండికేయడంతో.. ఓ నిండు ప్రాణం గాల్లో కలిసింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మొలకల చెరువుకు చెందిన చంద్రయ్య చెట్టెక్కి కింద పడ్డారు. స్థానికులు ఫోన్‌ చేయగా 108 వాహనం వచ్చింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న చంద్రయ్యను ఎక్కించుకుని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి బయల్దేరిన 108 అంబులెన్స్‌ మార్గం మధ్యలో మొరాయించింది. మదనపల్లె సమీపంలోని అమ్మచెరువు మిట్ట వద్దకు రాగానే అంబులెన్స్ ఆగిపోయింది. 108 అంబులెన్స్ సిబ్బంది మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందజేశారు. అక్కడి అధికారులు తక్షణమే వేరొక 108 అంబులెన్స్‌ను ఎదురు పంపారు. అయితే చంద్రయ్య అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది ధ్రువీకరించారు. మొదటి అంబులెన్స్‌ కండీషన్ బాగుండి సకాలంలో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి చేరుకొని ఉంటే చంద్రయ్య ప్రాణాలు దక్కేవని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Last Updated : Oct 22, 2023, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.