MILAN-2022: విను వీధిలో.. జల నిధిలో.. ఆకట్టుకున్న మిలాన్ విన్యాసాలు - vishakha milan
🎬 Watch Now: Feature Video
తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నగరంలోని బీచ్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు (మిలాన్-22) వేడుకగా సాగాయి. నమూనా యుద్ధ విన్యాసాలు, ‘అంతర్జాతీయ నగర కవాతు’(ఇంటర్నేషనల్ సిటీ పరేడ్) వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గగనతలంలో ఫైటర్‌జెట్స్, హెలికాఫ్టర్లు, యుద్ధవిమానాల విన్యాసాలు నగరవాసులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ఆకాశంలో రంగులు వెదజల్లుతూ పారాగ్లైడర్లు, నిప్పులు చిమ్ముతూ యుద్ధవిమానాల ప్రదర్శన అబ్బురపరిచింది.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST