వైభవంగా శ్రీవారి జ్యేష్టాభిషేకం - తిరుపతి టెంపుల్ న్యూస్
🎬 Watch Now: Feature Video
తిరుమలలో శ్రీవారి జ్యేష్టాభిషేకంను వైభవంగా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ఈ జ్యేష్టాభిషేకంలో శ్రీవారి ఉత్సవమూర్తులకు నూతన కవచాలు సమర్పిస్తారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు... ఈ ఉత్సవాన్ని ప్రతి ఏడాది జ్యేష్టామాసంలో నిర్వహిస్తారు. జ్యేష్టాభిషేకంలో భాగంగా ఆలయంలోని కళ్యాణ మండపంలో అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.