సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని అలంకరణలో పద్మావతి అమ్మవారు - Thiruchanur Padmavati Amma karthika bramhosthavam
🎬 Watch Now: Feature Video

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏడో రోజు ఉదయం అమ్మవారు శ్రీ శ్రీనివాసమూర్తి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ సమీపంలో ఉన్న వాహన మండపంలో అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, జ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.