పదిహేను వందల అడుగుల మువ్వన్నెల జెండా - రొద్దంలో భారీ జాతీయ జెండాతో ర్యాలీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10389103-148-10389103-1611663660892.jpg)
పదిహేను వందల అడుగుల మువ్వన్నెల జెండా... ముద్దులొలికే చిన్నారుల చిట్టి చేతులపై అందంగా కదిలింది. భారత్ మాతాకీ జై అంటూ తమ మృదుమైన స్వరంతో నినాదాలు చేస్తూ.. దేశభక్తిని చాటుకున్నారు. నలువీధులా వయ్యరంగా కదులుతున్న ఈ త్రివర్ణ పతాకం... అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్ర పురవిధుల్లో కనిపించింది. 72వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సామాజికవేత్త దొంతి లక్ష్మీ నారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఈ భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ఈ ప్రదర్శన నిర్వహించారు.