PRATIDWANI: ఆన్‌లైన్‌లో గంజాయి సరఫరా చేస్తున్న మాఫియా ముఠాలు.. వీటిని ఆపేదెలా? - అమరావతి వార్తలు
🎬 Watch Now: Feature Video
గంజాయి అక్రమ రవాణాకు మాఫియా ముఠాలు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నాయి. ఇప్పుడు ఈ ముఠాల కన్ను ఆన్‌లైన్ మార్గంపై పడింది. విస్తృత ప్రజాదరణ పొందిన ఈ కామర్స్ ప్లాట్‌ఫాంను ఎంచుకుని, గుట్టుచప్పుడు కాకుండా అందులో గంజాయి తరలిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు వస్తువులను పూర్తిగా ప్యాక్ చేసి, సురక్షితంగా రవాణా చేస్తాయి. సరిగ్గా ఈ అంశమే గంజాయి ముఠాలకు కలిసొచ్చింది. హెర్బల్ ఉత్పత్తులు, ఆకుల పేరుతో తయారుచేసిన పార్సిళ్లలో క్వింటాళ్ల కొద్ది గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ కామర్స్ వేదికలకు ఉన్న విశ్వసనీయతను కవచంగా వాడుకుని గంజాయిని రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసలు ఈ కామర్స్ వేదికలు అనుసరిస్తున్న మార్కెటింగ్, రవాణా పద్దతులు ఏంటి ? గంజాయి ముఠాల కట్టడికి ఆన్‌లైన్ వేదికలపై ఎలాంటి నిఘా అవసరం ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.