Pratidwani: ఉక్రెయిన్ యుద్ధంతో భారత్‌లో ధరల మంటలు.. యుద్ధం తీవ్రమైతే పరిస్థితేంటి? - నూనె ధరల పెంపుపై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో మన దేశంలో ఉక్కు, వంట నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న కొకింగ్ కోల్, సన్‌ఫ్లవర్ వంట నూనెల నిల్వలపై ఒత్తిడి పెరిగింది. కొందరు ముందుజాగ్రత్తగా అధిక మొత్తంలో కొనుగోలు చేస్తుంటే.. ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో ఉక్కు, వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అసలు ఉక్రెయిన్ యుద్ధం ఏఏ సరుకుల సరఫరాపై ప్రభావం చూపిస్తోంది ? పెరిగే ధరలకు ప్రభుత్వం కళ్లెం వేస్తుందా? సామాన్యులకు తాకుతున్న ధరాఘాతాన్ని నియంత్రించడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST