ప్రభుత్వ చర్చలు విఫలం - ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల్లో నిలచిపోయిన సేవలు - Arogyashri dues

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 10:10 AM IST

AP Govt Talks with Aarogyasri Trust Affiliated Hospitals Management: ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పెండింగులో ఉన్న బకాయిలు చెల్లించాలని, ప్యాకేజీ ధరలు పెంచకుంటే.. ఈ నెల 27 తర్వాత ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యసేవలు అందించలేమని ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం వెల్లడించిన విషయం తెలిసిందే. తదుపరి చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు ఆశా ప్రతినిధులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నెలాఖరులోగా 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని, మిగిలిన బిల్లులను డిసెంబరులోగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చికిత్సల ధరలు పెంచాలని ఆశా ప్రతినిధులు కోరగా.. ఆయుష్మాన్ భారత్ ధరల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్యాకేజీ పెంచాలనడంలో హేతుబద్ధత లేదని చెప్పారు. దీనిపై ఆశా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినియోగదారులు సూచి, ఇతర ఏ రకంగా చూసినా ధరలు పెరిగాయని పేర్కొన్నారు. తొలుత ప్రకటించిన ప్రకారమే ఈ నెల 27వ తేదీ తర్వాత రోగులకు సేవలు నిలిపేయాలన్న ప్రకటనకు కట్టుబడి ఉన్నామని ముఖ్య ప్రతినిధి డాక్టర్ మురళీకృష్ణ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.