ప్రతిధ్వని: ఈసారి ఐఐఐటీల్లో సీటు ఎవరికి దక్కేనో... - ట్రిపుల్ ఐటీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన సాంకేతిక విద్యకు పెట్టింది పేరు ట్రిపుల్ ఐటీలు. తెలుగు రాష్ట్రాల్లో బాసర, నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఐఐఐటీలు ఉన్నాయి. పదో తరగతిలో విద్యార్థులు పొందిన జీపీఏ పాయింట్ల ఆధారంగా ఐఐఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ప్రవేశాలు కల్పిస్తోంది. ఐఐఐటీలకు ఏటా డిమాండ్ భారీ స్థాయిలో ఉంటోంది. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించిన క్రమంలో ఐఐఐటీల్లో మరింత పోటీ పెరగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఐఐఐటీలకు ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ? ఐఐఐటీల్లో ఎలాంటి నాణ్యమైన విద్య లభిస్తుంది ? ఈసారి పోటీ సైతం పెరిగిన నేపథ్యంలో ప్రవేశ ప్రక్రియ సవాళ్లు ఏమిటనే అంశంపై ప్రతిధ్వని చర్చ.