శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం కారులో చెలరేగిన మంటలు - విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారులో మంటలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16945917-399-16945917-1668599671960.jpg)
Car Fire: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు దగ్ధమయ్యింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో.. అతనితో సహా యాజమాని వెంటనే కారులో నుంచి బయటకు దిగారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST