ETV Bharat / sukhibhava

జుట్టును పెంచే గింజలు.. మీరు ట్రై చేస్తారా?! - Hair Growth Seeds

Hair Growth Seeds: జుట్టుకు పైపైన ఎన్ని లేపనాలు పూసినా.. ఫలితం తక్కువే. అయితే.. పోషక విలువలున్న ఆహారానికి కొన్నిరకాల గింజలు జత చేసి తీసుకుంటేనే శిరోజాలు పెరుగుతాయంటున్నారు నిపుణులు..

crack hair fall problems
crack hair fall problems
author img

By

Published : Apr 19, 2022, 10:06 PM IST

నువ్వులు... నలుపు, తెలుపు నువ్వుల్లో విటమిన్లు, పాలీ శాచురేటెడ్‌ ఫ్యాటీయాసిడ్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి రక్తప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యతను సమన్వయం చేసి జుట్టు రాలకుండా చేస్తాయి.

పొద్దుతిరుగుడు... ఈ విత్తనాలు ఫ్రీరాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడేలా చేస్తాయి. వీటిలోని జింక్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌-ఇ వంటివి శిరోజాల పెరుగుదలలో తోడ్పడతాయి. దీంతో ఒత్తైన, మృదువైన కురులు మీ సొంతమవుతాయి.

అవిసె గింజలు.. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచు, ప్రొటీన్లు సహా మెగ్నీషియం, క్యాల్షియం వంటి పలురకాల ఖనిజాలు పుష్కలంగా ఉండే ఈ గింజలు శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

గుమ్మడి.. రోజూ చెంచా గుమ్మడి విత్తనాలను తీసుకుంటే ఫలితాలెన్నో. ముఖ్యంగా వీటిలోని జింక్‌, సెలెనియం, మెగ్నీషియం, ఐరన్‌, క్యాల్షియం, కాపర్‌, ఏ, బీ, సీ విటమిన్లు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ రంధ్రాలను శుభ్రంగా ఉంచి చుండ్రు రానివ్వవు. ఒత్తయిన జుట్టును సొంతం చేస్తాయి.

చియా.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే ఈ విత్తనాలు మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో పుష్కలంగా ఉండే పీచు, ప్రొటీన్లు తదితర ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలకుండా ఒత్తుగా ఉండేలా చేస్తాయి.

మెంతులు... వీటిలోని ప్రొటీన్లు, నియాసిన్‌, అమైనో యాసిడ్స్‌, పొటాషియం శిరోజాల పెరుగుదలకు తోడ్పడతాయి. చెంచా పెరుగులో పావుచెంచా మెంతులను నానబెట్టి రోజూ తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.