కర్నూలు జిల్లా నంద్యాల మండలం బ్రాహ్మణపల్లెలో తండ్రి,కుమారుడు నాగప్ప, అంకన్నలపై వైకాపా నాయకులు దాడి చేశారు. మండల నాయకుడు, భీమవరం గ్రామానికి చెందిన గోకుల్ రెడ్డి, తన అనుచరులతో దాడి చేశాడు. గ్రామంలో ఉన్న రహదారి పక్కన ఏర్పాటు చేసుకున్న దుకాణాన్ని తొలగించాలని దౌర్జన్యం చేసినట్లు బాధితులు వాపోయారు. ఇనుప రాడ్లతో కొట్టడంతో చేయి విరిగినట్లు అంకన్న తెలిపారు. ఎవరికైనా చెబితే అంతు చూస్తామని బెదిరించినట్లు బాధితులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: DEAD: ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరి మృతి