కడప జిల్లా బద్వేలు శ్రీ బీవీఆర్ పీజీ కళాశాలలో అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు ముగిశాయి. ఐదు రోజులపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో కడప యోగి వేమన విశ్వవిద్యాలయం 10 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన 75 విశ్వవిద్యాలయాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన ఈ క్రీడల్లో పంజాబ్కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ద్వితీయ స్థానంలో నిలువగా, మహారాష్ట్రకు చెందిన సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం, రాష్ట్ర సంత్ తుకడోజి మహారాజ్ నాగ్పూర్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను సాధించాయి.
ఇదీ చదవండి: