ETV Bharat / state

వైవీయూ డిగ్రీ ఫలితాల్లో శ్రావణికి ప్రథమస్థానం

యోగివేమన విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో శ్రావణి పదికి 10 గ్రేడింగ్‌ పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది.

వైవీయూ డిగ్రీ ఫలితాల్లో 10కి పది పాయింట్లతో ప్రథమస్థానంలో శ్రావణి

author img

By

Published : Nov 2, 2020, 9:35 AM IST

కడప యోగివేమన విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో జమ్మలమడుగు పట్టణానికి చెందిన శ్రావణి సత్తా చాటింది. బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పదికి 10 గ్రేడింగ్‌ పాయింట్లతో విశ్వవిద్యాలయం పరిధిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

పట్టణంలోని తాడిపత్రి రోడ్డు ప్రాంతానికి చెందిన వెంకటేష్‌, సుగునమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కాని డొక్కాడని జీవనం. వెంకటేష్‌ కూలి పనులు చేస్తుండగా.. సుగునమ్మ తోపుడుబండిపై పండ్లు విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మొదటి అమ్మాయి ఎం.లక్ష్మి ఎమ్మెస్సీ చదివి నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. రెండో అమ్మాయి మేకల శ్రావణి పదో తరగతి వరకు జమ్మలమడుగు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంది. స్థానిక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యనభ్యసించింది. అక్టోబరు 31న యోవేవి విడుదల చేసిన డిగ్రీ ఆరో సెమిస్టర్‌ ఫలితాల్లో శ్రావణి 10కి 10 గ్రేడింగ్‌ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.

సివిల్స్‌పై దృష్టిసారిస్తాను

ఎంసీఏ చదివి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడిన తర్వాత సివిల్స్‌పై దృష్టిసారించాలని అనుకుంటున్నాను. ఎంసీఏ ఖర్చుతో కూడుకున్నది, దాతలెవరైనా చేయూతనిస్తే లక్ష్యం సాధిస్తా. - మేకల శ్రావణి, విద్యార్థిని, జమ్మలమడుగు.

ఇవీ చదవండి

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్మగ్లర్లు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.