కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను పంపిణీ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో.. నియోజకవర్గంలోని ప్రతి సీహెచ్సీ, పీహెచ్సీలకు మొత్తం 27 యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నియోజకవర్గంలో కరోనాను అరికట్టేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
భవిష్యత్తులో కరోనా మూడో దశ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో ఎంపీ మిథున్ రెడ్డి నేతృత్వంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. ప్రజారోగ్యంపై సీఎం జగన్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకొని కరోనా వైరస్ ను ఎదుర్కొవాల్సిన బాధ్యత ఉందన్నారు.