కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పుల్లంపేట, పెనగలూరు మండలాల్లో ముస్లింలకు రంజాన్ కానుకగా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాకుండా వైకాపా ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన 9 నవరత్నాల సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు.
ఇదీ చూడండి