ETV Bharat / state

ఎంపీటీసీ పదవికి నామినేషన్ వేశానని కక్ష కట్టారు: ఓ మహిళా నేత ఆరోపణ - కడప జిల్లా తాజా వార్తలు

ఎంపీటీసీ పదవికి నామినేషన్ వేసినందుకు వైకాపా నాయకులు తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఓ మహిళ ఆరోపించింది. వారి బెదిరింపులకు భయపడి కొద్దిరోజులు ఊరు విడిచి వెళ్లామని ఆమె తెలిపారు. తిరిగి గ్రామానికి వస్తే తన భర్తపై అక్రమ కేసు పెట్టించి అరెస్టు చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

kadapa
kadapa
author img

By

Published : Nov 19, 2020, 5:25 PM IST

మీడియాతో జ్యోతి

వైకాపా నేతలు తన కుటుంబాన్ని చిత్ర హింసలకు గురి చేస్తున్నారని జ్యోతి అనే మహిళ ఆరోపించింది. తన భర్తపై అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేసింది. కడప ప్రెస్​క్లబ్​లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి సంబంధించి ఎంపీటీసీ బీసీ మహిళకు కేటాయించగా నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. నామినేషన్ ఉపసంహరించుకోవాలని స్థానిక వైకాపా నాయకులు బెదిరించారు. వారి బెదిరింపులకు భయపడి ఊరి వదలి వెళ్లాం. కొద్దిరోజుల క్రితం తిరిగి గ్రామంలోకి రాగా... నా భర్తపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించి అరెస్టు చేయించారు. బీసీలు రాజకీయంగా ఎదగకూడదా?. అధికారులు న్యాయం చేయకపోతే నా కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం- జ్యోతి, బాధితురాలు

ఇదీ చదవండి

రైలు ఇంజిన్​ ఎక్కి సెల్ఫీ- నిండు ప్రాణం బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.