ETV Bharat / state

తెదేపా మద్దతుదారుపై.. వైకాపా నాయకుల దాడి - ycp cadre attack on tdp follower news

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లె గ్రామంలో.. తెదేపా మద్దతుదారుపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. జడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, అతడి అనుచరులు.. తమ కుటుంబంపై దాడి చేశారని తెదేపా మద్దతుదారు పద్మావతి ఆరోపించారు. వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

ycp cadre attack on tdp follower at erraguntla in kadapa district
తెదేపా మద్దతుదారుపై వైకాపా నాయకుల దాడి
author img

By

Published : Dec 31, 2021, 7:09 PM IST

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లె గ్రామంలో వైకాపా నాయకులు తనపై దాడి చేెశారని.. అదే గ్రామానికి చెందిన తెదేపా మద్దతుదారు పద్మావతి ఆరోపించారు. జడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, అతడి అనుచరులు.. తమ కుటుంబంపై దాడి చేసినట్లు ఆరోపించారు.

గత సాధారణ ఎన్నికల్లో సమయంలోనూ తనను కిడ్నాప్ చేశారని.. పోలీసులే రక్షించారని పద్మావతి తెలిపారు. విచక్షణారహితంగా దుర్భాషలాడి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారి వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. గాయపడిన పద్మావతిని ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

MLA Sridevi: నేను అలా అనలేదు.. ఆ వీడియో ఎడిటింగ్ చేశారు: ఎమ్మెల్యే శ్రీదేవి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.