కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పరిధిలోని రెండు ప్రాంతాల్లో పిడుగు పడి మహిళ ఒకరు మృతి చెందగా … రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. అర్ధరాత్రి సమయంలో భయంకరమైన ఉరుములు, మెరుపులు వచ్చాయి. ఈ శబ్దానికి మల్లేపల్లెకు చెందిన ఓబగాని లక్ష్మీదేవి (38) అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మలెగుడిపాడులో పిడుగుపాటుకు రెండు గేదెలు చనిపోయాయి. ఈ ఘటనతో రైతు ఆర్థికంగా నష్టపోయారు.
ఇదీ చదవండి: వైరస్ బూచితో అంబులెన్స్‌కు రూ.వేలు వసూలు