చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధురాలిని సకాలంలో బ్లూ కోల్ట్స్ పోలీసులు కాపాడారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఆదిలక్ష్మమ్మ అనే వృద్ధురాలికి పిల్లలు లేరు. భర్త ఇటీవల కాలంలో మృతి చెందాడు. నా అన్నవారు ఎవరూ లేకపోవడం.. పైగా బంధువులు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదిలక్ష్మమ్మని కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చారు. మేమున్నామంటూ భరోసానిచ్చారు.
ఇదీ చదవండి: చిత్తూరు జిల్లాలో నరబలి కలకలం