కడప జిల్లా సిద్దవటం, అట్లూరు అటవీ ప్రాంతంలో వాహనాల రాకపోకల సమయాన్ని సడలించారు. ఈ మేరకు వన్యప్రాణి సంరక్షణ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఉదయం ఐదున్నర గంటల నుంచి.. అలాగే రాత్రి 10 గంటల వరకు వాహనాలను అనుమతిస్తారు. గతంలో ఉదయం 6 గంటలకు.. రాత్రి 9 గంటల వరకే వాహనాలను అనుమతించేవారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎంపీ అవినాష్ రెడ్డి అటవీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి వాహనాల రాకపోకల సమయాల్లో మార్పులు చేయించారు.
ఇవీ చూడండి...