కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట ఉద్యాన కళాశాలలోని క్వారంటైన్ కేంద్రాన్ని డ్వామా పీడీ యధుభూషణ్ రెడ్డి, నోడల్ అధికారి బ్రహ్మయ్యతో కలిసి పరిశీలించారు. ఈ క్వారంటైన్ కేంద్రాన్ని కొవిడ్ కేర్ కేంద్రంగా మారుస్తున్నామని పీడీ యధుభూషణ్ రెడ్డి తెలిపారు. కరోనా బాధితులకు ఉన్నత వైద్యం అందించే లక్ష్యంతో ఇక్కడ కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఇక్కడ ఉన్న 52 గదుల్లో మూడు పడకల చొప్పున ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఈ కేంద్రం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ శివరాం, ఎంపీడీవో మహబూబ్ ఖాన్, ఎస్ఐ వెంకట నరసింహం, స్థానిక వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి ఔషధం.. దొరకడం కష్టం