కడప జిల్లా రాయచోటి పురపాలకలో తాగునీటిని సరఫరా చేస్తున్న నీటి ట్యాంకుల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పట్టణంలో వివిధ ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేయాల్సిన సిబ్బంది ట్యాంకుల వద్దకు వెళ్లాలంటే భయపడుతున్నారు. వర్షాకాలం అయినందున పరిసరాలలో పరిశుభ్రత కొరవడింది. విద్యుత్తు సరఫరా ఉన్న వేళల్లోనే సిబ్బంది ట్యాంకుల వద్దకు వెళ్లి గేట్ వాల్వ్‌లు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ట్యాంక్ నిర్మాణ సమయంలో విశాలమైన స్థలం ఎంపిక చేసి నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో సరఫరా అవుతున్న నీటిని నిలువరించేందుకు గేట్ వాల్వ్‌ను ఏర్పాటు చేశారు. మట్టి కోసం తీసిన గోతులు లోతుగా ఉన్నాయి. వాటిపై మూతలు అమర్చాల్సి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. దీంతో రాత్రివేళ విధి నిర్వహణకు వెళ్లే సిబ్బంది ప్రమాదవశాత్తు గోతిలో పడి గాయపడుతున్న సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారుల దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. ట్యాంకుల పరిసరాలలో నిర్మించిన వాచ్ మెన్ గదులు నివాసం లేక నిరుపయోగంగా ఉంటున్నాయి.
తాగు నీటి సరఫరా ట్యాంకులకు కొరవడిన నిర్వహణ చర్యలు - water tanker problems in kadapa district
కడప జిల్లా రాయచోటి పురపాలకలో తాగునీటి సరఫరా చేస్తున్న నీటి ట్యాంకుల నిర్వహణ సరిగ్గా లేదంటూ స్థానికులు వాపోతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదంటూ తెలిపారు.

కడప జిల్లా రాయచోటి పురపాలకలో తాగునీటిని సరఫరా చేస్తున్న నీటి ట్యాంకుల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పట్టణంలో వివిధ ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేయాల్సిన సిబ్బంది ట్యాంకుల వద్దకు వెళ్లాలంటే భయపడుతున్నారు. వర్షాకాలం అయినందున పరిసరాలలో పరిశుభ్రత కొరవడింది. విద్యుత్తు సరఫరా ఉన్న వేళల్లోనే సిబ్బంది ట్యాంకుల వద్దకు వెళ్లి గేట్ వాల్వ్‌లు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ట్యాంక్ నిర్మాణ సమయంలో విశాలమైన స్థలం ఎంపిక చేసి నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో సరఫరా అవుతున్న నీటిని నిలువరించేందుకు గేట్ వాల్వ్‌ను ఏర్పాటు చేశారు. మట్టి కోసం తీసిన గోతులు లోతుగా ఉన్నాయి. వాటిపై మూతలు అమర్చాల్సి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. దీంతో రాత్రివేళ విధి నిర్వహణకు వెళ్లే సిబ్బంది ప్రమాదవశాత్తు గోతిలో పడి గాయపడుతున్న సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారుల దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. ట్యాంకుల పరిసరాలలో నిర్మించిన వాచ్ మెన్ గదులు నివాసం లేక నిరుపయోగంగా ఉంటున్నాయి.
asdfa
Conclusion: