ETV Bharat / state

అన్నమయ్య జలాశయం నుంచి సాగునీరు విడుదల

కడప జిల్లా రాజంపేటలోని అన్నమయ్య జలాశయం నుంచి అధికారులు నీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి నీటిని వదిలారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాలువల ద్వారా వచ్చే నీటిని చెరువుల్లో నిల్వ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల భూగర్భజలాలు పెరుగుతాయని.. తద్వారా సాగునీటి కష్టాలు ఉండవని వివరించారు.

water releades from annamayya reservoir at rajampet kadapa district
అన్నమయ్య జలాశయం
author img

By

Published : Jan 25, 2020, 6:03 PM IST

.

అన్నమయ్య జలాశయం

.

అన్నమయ్య జలాశయం
Intro:Ap_cdp_47_25_VO_annamaiah_jalasaya_neeru vidudala_Av_Ap10043
k.veerachari, 9948047582
సాగునీటి కోసం ఎదురుచూసిన రైతన్నల్లో కాసింత సంతోషం కనిపిస్తోంది. జలాశయం నుంచి కాలువకు నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు అధికారులకు పెట్టుకున్నారు. ఈ మేరకు స్పందించిన అధికారులు నీటిని విడుదల చేయడానికి సరే అన్నారు. దీంతో కడప జిల్లా రాజంపేటలోని అన్నమయ్య జలాశయం నుంచి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి నీటిని విడుదల చేశారు. గంగమ్మ పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉన్న నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీటిని వృధా చేయకుండా కాలువలకు గండ్లు పెట్టకుండా సాగునీటిని వినియోగించుకోవాలని తెలిపారు. కాలువల ద్వారా పారే నీటిని చెరువులకు నింపుకోవాలని తెలిపారు. దీనివల్ల చెరువు భూముల్లో భూగర్భ జలాల పెరుగుతాయని సాగునీటి కష్టాలు ఉండవని చెప్పారు.


Body:జలాశయం నుంచి నీరు విడుదల


Conclusion:1.ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి
2. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.